Monday, January 27, 2025

సోదరుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత…ఎందుకు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ వివాహిత వరసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెంది సోమేష్, సూర్యాపేట జిల్లాకు చెందిన చామంతిని(28) 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దంపతులు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018లో తన సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్ హైదరగూడలోని గుమ్మకొండకాలనీలో ఇల్లు కొన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో నర్సింహులు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్‌లో సోమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. నర్సింహులు బావమరిది శేఖర్(25) అరు నెలల క్రితం బావ వద్దకే వచ్చి ఉంటున్నాడు.

ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటున్నాడు శేఖర్. నర్సింహ్మా దంపతులు, సోమేష్ సూర్యాపేటలో దశదినకర్మ ఉండడంతో అక్కడికి వెళ్లారు. చామంతి తన పిల్లలను స్కూల్‌కు పంపించారు. ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం 3.30కి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మెయిర్ డోర్ లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో కిటికీలో నుంచి తొంగిచూశారు. తల్లి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో ఇరుగుపొరుగువారికి సమాచారం ఇచ్చారు. హాల్లో చామంతి, పడక గదిలో శేఖర్ ఉరేసుకొని కనిపించడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం ఉందా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వివాహితపై శేఖర్ అత్యాచారం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News