Monday, December 23, 2024

ఆ మూడు సర్వే నెంబర్‌లు నిషేధిత జాబితాలో లేవు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ‘తిమ్మాపూర్‌లో వేయి కోట్ల కుంభకోణం’పై వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. దీనికి సంబంధించి కందుకూరు తహసీల్దార్ ఆ భూములకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఒక నోట్‌ను విడుదల చేశారు. కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 6, 147, 167, 197, 444, 453, 454, 455, 573, 574 & 575 సర్వే నెంబర్‌లలో 135.04 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి భూదాన్ బోర్డుకు సంబంధించిదన్నారు. (129, 130, 161/ఏ) సర్వే నెంబర్‌లు నిషేధిత జాబితాలో లేవని, భూదాన్ బోర్డు నుంచి ఈ మూడు సర్వే నెంబర్‌లకు క్లియరెన్స్ ఉందని, ఈ మూడు సర్వేనెంబర్‌లోని భూములు పట్టా భూములని తహసీల్దార్ తెలిపారు.

ఈ మూడు సర్వే నెంబర్‌లలో సుమారుగా 36.23 ఎకరాల భూమి ఉందని, అందులో భాగంగానే ఈ భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చలేదని ఆయన పేర్కొన్నారు. మాములుగా నిషేధిత జాబితాలో ఉంటేనే వాటిని 22ఏలో చేర్చుతామని ఆయన తెలిపారు. పట్టా, రికార్డుల ధృవీకరణ ప్రకారం, సీసాల పహాణి 1955 నుంచి ఇప్పటి వరకు భూములు అమ్మిన వారు అసలు పట్టాదారులుగా ధరణి పోర్టల్‌లో చేర్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News