Monday, December 23, 2024

‘రంగబలి’ని పవన్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో పూర్తి ఎంటర్‌టైనర్ ‘రంగబలి’తో వస్తున్నారు. ఎస్. ఎల్.వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 7న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ… దర్శకుడు పవన్ చెప్పిన కథ నచ్చింది. చేస్తే ఇలాంటి కథ చేయాలనిపించింది.

ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాము అని అన్నారు. దర్శకుడు పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ… ఈ సినిమాలో నాగశౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండ ఈ సినిమా తీశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ ఓదెల, కిషోర్ తిరుమల, యుక్తి తరేజ, సుమ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News