Monday, December 23, 2024

రంగమార్తాండ నుండి బ్రహ్మానందం గ్లిమ్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా ‘రంగమార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

గ్లిమ్స్ లో బ్రహ్మానందం తన స్వరంతో చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్ బెడ్పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో.. గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్ చూసి ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల రంగమార్తాండ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన షాయిరీ అలాగే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ నన్ను నన్నుగా కు మంచి స్పందన లభిచింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు అందించగా లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News