Monday, December 23, 2024

శ్రమశక్తి అవార్డుకు ఎన్నికైన రంగనాథ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇల్లందు టౌన్‌: కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే శ్రమశక్తి అవార్డుకు ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు రంగనాథ్ ఎన్నికయ్యారు. ఈ అవార్డును ఆయన మే ఒకటవ తేదిన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించే మేడే ఉత్సవాలలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు. గడిచిన కొన్నేళ్ళుగా కార్మికుల హక్కుల సాధన కోసం వారి సమస్యల పరిష్కారం కొరకు ఆయన చూపించిన చొరవ ద్వారానే అవార్డు దక్కింది. అవార్డు అందుకోనున్న ఆయనకు కార్మికులు, పలువురు పట్టణ ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News