Monday, September 23, 2024

కెసిఆర్ కారణ జన్ముడు: హరీష్ రావు

- Advertisement -
Ranganayak sagar water released
సిద్దిపేట: సిఎం కెసిఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీళ్లను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విడుదల  చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. సిఎం నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో జీవించాలనీ భవంతున్ని ప్రార్థిస్తున్నానని ఆకాంక్షించారు. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదని, రంగనాయక సాగర్ జలాశయం ఉండేది కాదన్నారు. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు వచ్చేవి కావన్నారు. కెసిఆర్ కారణ జన్ముడు అని, గొప్ప కార్యం కోసం పుట్టిన మహాత్ముడు అని కొనియాడారు. స్వరాష్ట్రం తెలంగాణను స్వప్నిoచిండని, సాకారం చేసిండని, సిఎంగా ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారని ప్రశంసించారు.
గుక్కెడు నీళ్ల కోసం తపించిన తెలంగాణను సమృద్దిగా సాగు జలాలతో ఆకుపచ్చ తెలంగాణ, సస్య శ్యామల తెలంగాణ మార్చారని కొనియాడారు. అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి కోసం సిఎం కృషి చేస్తున్నారని, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు.  7 సంవత్సరాల లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిచిందని మెచ్చుకున్నారు.
కేంద్రం అనేక షరతులు, నిబంధనలు పెడుతున్నామని, ప్రాజెక్ట్ లకు నిధులు రాకుండా అడ్డు పడుతుందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఇసి నుంచి అప్పుగా నిధులు రాకుండా అడ్డు పడుతుందన్నారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతో 7 ఏండ్లతో తెలంగాణ జిఎస్ డిపిని రెట్టింపు చేశామన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ ను నెం.1 గా నిలిపామన్నారు. రైతుల ఆకాంక్షల మేరకు ఎడమ కాలువ ద్వారా సాగు జలాల విడుదల చేశామన్నారు.
సిద్దిపేటతో పాటు సిరిసిల్ల, మానకొండూరు, హుస్నాబాద్ నియోజవర్గంకు సాగునీరు అందనుందన్నారు. పాత రోజుల్లో యాసంగి పంట అనగానే కాలిపోయే మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్ లు గుర్తుకు వచ్చేవని, లెక్కకుమించి బోర్లను తవ్వే పరిస్థితి ఉండేదన్నారు. కలలో ఊహించని విధంగా మూడున్నర ఏండ్ల లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించుకున్నామని ప్రశంసించారు. 24 గంటల నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలతో సమకూర్చుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News