Wednesday, January 22, 2025

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన ప్రేమ

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ప్రేమ విఫలంకావడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోనసీమ జిల్లాకు చెందిన చంద్ర ప్రకాశ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌లోని టిసిఎస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 2021 నుంచి ఆదిభట్లలోని లక్ష్మీకృప హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం ఆయన హాస్టల్ రూమ్‌లో బెట్ షీట్ సహాయంతో ఉరేసుకున్నాడు. తోటి మిత్రులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. హాస్టల్ నిర్వహకుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News