Thursday, December 26, 2024

బొలేరోతో ఢీకొట్టి.. వాహనంలో తీసుకెళ్తుండగా

- Advertisement -
- Advertisement -

అమనగల్లు: బొలేరో వాహనంతో పాదచారుడిని ఢీకొట్టి అనంతరం తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో కన్నుమూయడంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చంద్రాయన్‌పల్లితండాలో జఠావత్ బద్యానాయక్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సూర్యలక్ష్మి కాటన్ మిల్లులో పని చేసుతన్నారు. గురువారం తెల్లవారుజామున శ్రీశైలం జాతీయ రహదారిపై కాటన్ మిల్లులో పని చేసేందుకు వెళ్తుండగా బొలేరో వాహనం ఢీకొట్టడంతో బద్యానాయక్ తీవ్రంగా గాయపడ్డాడు.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

బద్యానాయక్‌ను చికిత్స నిమిత్తం బొలోరే వాహనంలో కల్వకుర్తికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. వెంటనే రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనంచేసుకొని భార్యకు సమాచారం ఇచ్చారు. హత్య చేసి ఉంటారని పోలీసులు భార్య ఫిర్యాదు చేశారు. శవ పరీక్షలో మాత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు రావడంతో వెంటనే సిసి కెమెరాల ఆధారంగా బొలేరో వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకున్నాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News