Wednesday, January 22, 2025

తలసరి ఆదాయంలో దక్షిణాదిలోనే రంగారెడ్డి టాప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదాయాన్ని సముపార్జించుకోవడంలో దక్షిణభారత రా ష్ట్రా ల్లో రంగారెడ్డి జిల్లా ప్రజలు అగ్రస్థానంలో నిలిచారు. దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగ్రస్థానంలో నిలిచిన 18 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ప్రజల తలసరి ఆదాయం 6.25 లక్షల రూపాయలు గా ఉంది. 2019-20వ ఆర్ధిక సంవత్సరంలోని దక్షిణాది రాష్ట్రాల ప్రజల జీవన స్థితి గతులపై ఇండియా.ఇన్.పిక్సెల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రజల ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ఆ సంస్థ సర్వే నిర్వహించింది.

దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఉపాధి అవకాశాలు భారీగా ఉన్నాయని, అందుకే ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో విస్తరించిన ఐ.టి. కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రం గాలు, పారిశ్రామిక వాడలు, భారీగా ఉండటం, ప్రత్యక్ష ఉద్యోగాలకు తోడుగా పరోక్ష ఉపాధి అవకాశాలు విరివిగా ఉండటంతోనే రంగారెడ్డి జిల్లా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన అర్బన్ బెంగళూరు జిల్లా ప్రజల తలసరి ఆదాయం 5.42 లక్షల రూపాయలుగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రజల తలసరి ఆదాయానికి, రెండో స్థానంలో ఉన్న అర్బన్ బెంగళూరు జిల్లా ప్రజల తలసరి ఆదాయానికి మధ్య ఏకంగా 83 వేల రూపాయల వ్యత్యాసం ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రజల ఆదాయమే గరిష్టంగా ఉందని ఆ సర్వే స్పష్టంచేసింది. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక రాజధాని బెంగళురు అర్బన్ జిల్లా 5.42 లక్షల రూపాయలు ఉంది.

మూడో స్థానంలో తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా 3.84 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఏడాదికి 3.72 లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని జిల్లా అయిన హైదరాబాద్ ప్రజలు ఏడాదికి 3.62 లక్షల రూపాయలను ఆర్జిస్తూ అయిదో స్థానం లో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కోయంబత్తూరు (3.35 లక్షలు), ఈరోడ్ (3.17 లక్షలు-తమిళనాడు), కేరళలోని ఎర్నాకులం (3.16 లక్ష లు), కేరళలోని అలప్పుఝ (3.11 లక్షలు), కర్నాటకలోని ఉడుపి (2.98 లక్షలు), తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా (2.9 లక్షలు), కేరళలోని కొల్లం జిల్లా (2.85 లక్షలు), కర్నాటకలోని చిక్కమంగళూరు జిల్లా (2.84 లక్షలు), తమిళనాడులోని కాంచీపురం జిల్లా (2.81 లక్షలు), కేరళలోని కొట్టాయం జిల్లా (2.7 లక్షలు), తమిళనాడులోని నమక్కళ్ జిల్లా (2.7 లక్షలు), చెన్నయ్ జిల్లా (2.66 లక్షలు), కేరళలోని త్రిశూర్ జిల్లా (2.57 లక్షలు)లు ఆదాయ సముపార్జనలో ముందున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News