- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను కారు ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఓ కుటుంబం నల్లగొండ నుంచి ఇసిఐఎల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -