Friday, January 17, 2025

ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ప్రైవేటు హాస్టల్‌లో బీటెక్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యిద్యార్థిని ఇబ్రహీంపట్నంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె మంగల్‌పల్లిలో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉండి చదువు కొనసాగిస్తోంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పై అంతస్థులో వసతి గృహం నిర్వహించడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో స్థిరాస్తి ఆఫీస్ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులలో ఒకరి జన్మదిన వేడుకలు జరిగాయి. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద నల్లగొండ జిల్లాకు చెందిన అజిత్(22) కారు డ్రైవర్‌గా పని చేశాడు. జన్మదిన వేడుకలలో పాల్గొన్న అజిత్ ప్రైవేట్ హాస్టల్ రూమ్‌లో వెళ్లి విద్యార్థినిపై అత్యాచారం చేస్తుండగా కేకలు వేసింది. పక్క గదిలోని విద్యార్థులు గడియ పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News