Friday, November 15, 2024

భారీగా గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

Rangareddy Excise staff seizing heavy Marijuana

కౌకుర్ దర్గా సమీపంలో 462కిలోలు స్వాధీనం
హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టివేత
వివరాలు వెల్లడించిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్

హైదరాబాద్ : అంతరాష్ట్ర గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకులను రంగారెడ్డి ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 462 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.5లక్షలు ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఫరీద్, ఇస్మాయిల్, సచిన్, బస్వరాజ్ నలుగురు కలిసి ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో గంజాయిని కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నలుగురు నిందితులు కలిసి 462 కిలోల గంజాయిని కారులో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర శివారులోని కౌకూర్ గ్రామం వద్ద నిందితులు గంజాయిని వేరే కారులోకి మార్చుతుండగా ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితులు ఏఓబిలో 3,000 కిలోలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇందులో 1,500 కిలోలు మంబాయిలో విక్రయించారు. గంజాయి రవాణాపై నిఘాపెట్టామని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News