Thursday, January 23, 2025

హయత్ నగర్ లో తనయుడిని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో కుమారుడిని తండ్రి హత్య చేశారు. హయత్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ కు వినయ్ అనే కుమారుడు ఉన్నాడు. ఐదు సంవత్సరాల క్రితం ప్రవళిక అనే యువతిని వినయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వినయ్- ప్రవళిక దంపతులకు రెండు సంవత్సరాల పాప రక్షిత ఉంది. గత కొన్ని రోజుల నుంచి వినయ్ మద్యానికి బానిసగా మారాడు. ప్రతీ రోజు ఇంట్లో తల్లిదండ్రులు, భార్యను వేధించేవాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో మంగళవారం అర్ధరాత్రి వినయ్ పూటుగా తాగి గొడవకు దిగడంతో తండ్రి పార తీసుకొని కుమారుడిపై దాడి చేశాడు. దీంతో కుమారుడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News