Friday, December 20, 2024

ఎల్‌బి నగర్‌లో రోడ్డు ప్రమాదం: సిఐ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్ బినగర్ లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను కారు ఢీకొట్టడంతో సిఐ మృతి చెందగా మరో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన సాదిక్ అలీ ఎక్సైజ్ శాఖలో సిఐగా పని చేస్తున్నారు. నారాయణగూడ ఎక్సైజ్ ఎస్‌ఐ మోహినుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎల్ బి నగర్ లో ఓ వేడుకకు హాజరై మలక్ పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఐ, సిఐలు మలక్ పేటలో క్వార్టర్స్ లో ఉంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News