Sunday, January 19, 2025

క్రికెట్ ఆడుతుండగా ప్రాణంపోయింది…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నం జిల్లాకు చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి వద్ద ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి కెసిఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు. శనివారం 12 గంటల ప్రాంతంలో దిలీప్, తేజకిరణ్, అజయ్, బాలప్రదీప్‌తో కలిసి ఆడుతుండగా సంజయ్ అస్వస్థతకు గురయ్యాడు. తల నొప్పిగా ఉండడంతో ఆట మధ్యలో కూర్చున్నాడు. కొద్దిసేపటికే కుప్పకూలిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు గుండెపోటుతో చనిపోయాడని వివరణ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News