Tuesday, January 7, 2025

కూతురి అత్తను చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోడలు తండ్రి సుత్తెతో వియ్యంకురాలిపై దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహేశ్వరం మండలంలోని కెసి తండాలో జతావత్ ప్రభు(45) తన భార్య శాంతితో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు శాంతి అనే కూతురు ఉంది.

రెండు సంవత్సరాల క్రితం అల్మాస్‌గూడకు చెందిన కొర్ర జయరామ్‌కు తన కూతురు స్వాతిని ఇచ్చి ప్రభు వైభవంగా పెళ్లి చేశాడు. గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తన కూతురు చూసేందుకు ప్రభు తన అల్లుడికి ఇంటికి వచ్చాడు. అదే సమయంలో కూతురు స్వాతి, తన లలిత(50) గొడవకు దిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో సుత్తె తీసుకొని వియ్యంకురాలిపై ప్రభు దాడి చేశాడు. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News