- Advertisement -
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిఖిల్ కుమార్ (16) అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యం విషాదంతో ముగిసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చారీ నగర్ వద్ద నీటి కుంటలో నిఖిల్ శవమై తేలాడు. జనవరి 21న ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి విద్యార్థి అదృశ్యమయ్యాడు. నెల రోజుల తర్వాత చారీ నగర్ వద్ద నిఖిల్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్ జిఐఎ పోలీసులు వెల్లడించారు.
- Advertisement -