Saturday, January 11, 2025

మెయినాబాద్‌లో కాలుతున్న మహిళ మృతదేహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో మహిళ హత్యకు గురైంది. దుండగులు మహిళను చంపి తగులబెట్టారు. కాలుతున్న మహిళ మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన మహిళల వివరాలు తీసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఎక్కడో హత్య చేసి ఇక్కడి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎవరు అనేది తెలిస్తే నిందితులను పట్టుకోవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News