- Advertisement -
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో వరుస దొంగతనాలతో దుండగులు. హడలెత్తిస్తున్నారు. 12 గంటల వ్యవధిలో రాజేంద్రనగర్ లో రెండు దొంగతనాలు జరిగాయి. తాళం వేసిన ఇండ్లను దొంగల ముఠా టార్గెట్ చేస్తున్నాయి. హిమాయత్ సాగర్ లో రాములు అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలతో పాటు 50వేల నగదు చోరి చేశారు. కిస్మత్ పూర్ లోని ఓం నగర్ కాలనీ లో టివి ఆర్టిస్ట్ శైలేష్ ఇళ్లును ముఠా సభ్యులు గుళ్ల చేశారు. ఇంట్లో ఉన్న5 తులాల బంగారం, విలువైన వెండి ఆభరణాల తో పాటు నగదుతో దొంగలు ఉడాయించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ముఠా వరుస దొంగతనాలతో సైబరాబాద్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
- Advertisement -