Monday, December 23, 2024

తెలంగాణలో దారుణం…. తల్లితో సహజీవనం… బిడ్డపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

కామాంధునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు

మన తెలంగాణ /రాజేంద్రనగర్ : అభం , శుభం తెలియని చిన్నా రిపై పెంపుడు తండ్రి దారుణ అఘాయిత్యాని ఒడిగట్టిన సంఘటన ఇది. భర్తలేని మహిళను లోబరుచుకున్న దుండగులు ఆమెతో సహజీవనం చేస్తు ఆతల్లి కన్న బిడ్డపై ఘెరానికి పాల్పడ్డాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మైలార్‌దేవ్‌పల్లి వెంకటేశ్వరా కాలనీలో భ ర్తను వదిలేసిన ఓ మహిళల కూలీ పనులు చేసుకుంటు తన కుమార్తె (11)తో కలసి నివాసం ఉంటుంది.

ఆరేళ్ల క్రితం ఆమెతో చనువు పెంచుకున్న బడంగ్‌పేట్‌కు చెందిన సుదర్శన్ (47) సహజీవనం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా మహిళ కుమార్తె పై కన్ను వేసిన ఆకా మాంధుడు తల్లి పనికి వెళ్లిన సమయంలో వెకిలి చేష్టలతో పలు సా ర్లు పై వేధింపులకు గురి చేయడమే కాకుండా అత్యాచారయత్నం చే శాడు. ఈ విషయాన్ని బాలిక తల్లితో చెప్పడంతో షాక్ గురైన మ హి ళ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘోరాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేసింది. తనతో సహజీవనం చేస్తునే సుదర్శన్ తాను లేని సమయంలో తన కూతురుపై అత్యాచారయత్నం చేశాడని, నా న్న అని పిలిస్తే నరకం చే పించాడని కన్నీటి పర్యాంతం పోలీసులకు వివరించింది. ఈమేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News