- Advertisement -
రంగారెడ్డి: రాజేంద్రనగర్ లో పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఆరంఘర్ చౌరస్తా సమీపంలో యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. యువకుడిని ఢీకొట్టిన వెంటనే వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి టివి ఫూటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -