Monday, December 23, 2024

15 రోజుల్లో ప్రియుడితో పెళ్లి… సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: సహజీవనం చేస్తున్న వ్యక్తితో 15 రోజుల్లో పెళ్లి… ఇంతలోనే ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిహార్ రాష్ట్రానికి చెందిన అదితి భరద్వాజ్ (34) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో ఇక్కడే స్థిరపడింది. భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మణికొండలో నివాసం ఉంటున్న ఆమెకు మహ్మద్ అలీ పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు లేకపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అత్తాపూర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఫిబ్రవరి 12న పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. అదితికి అనారోగ్య సమస్యలు రావడంతో వైద్యురాలిని సంప్రదించారు. ఆమె గర్భవతి అని తెలియడంతో ఆందోళనకు గురై తన ప్రియుడు మహ్మద్ అలీకి సమాచారం ఇచ్చింది. ఫ్లాట్‌కు వచ్చేసరికి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించడంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News