Monday, January 20, 2025

‘సరూర్ నగర్ లో పంజాబ్ డ్రెస్ వేసుకుందని భార్యను నరికి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దంపతుల మధ్య మనస్పర్థలు ఉండడంతో భార్య పంజాబ్ డ్రెస్ వేసుకుందని ఆమెను భర్త హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… గుంజి వెంకటేశ్- సోనీ అనే దంపతులు గత కొంతకాలంగా కొత్తపేటలోని సరస్వతీ నగర్ లో ఉంటున్నారు. వెంకటేశ్ తాపీ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తుండగా ఆమె ఇళ్ల పని చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యపై అనుమానం ఉండడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు ఉన్నాయి. రెండో మూడో రోజుల క్రితం నుంచి ఆమె పంజాబ్ డ్రెస్సులు ధరిస్తుండడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పంజాబ్ డ్రెస్ చింపేసి ఆమెను కూరగాయాలతో కత్తితో నరికాడు. ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య కత్తితో పొడుచుకొని మృతి చెందిందని పోలీసులకు తెలిపారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మృతురాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా టంగూటూరు మండలం కొణిజేడు గ్రామానికి చెందిన ఆమెగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News