Wednesday, January 8, 2025

శంషాబాద్‌లో విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: విద్యార్థినిని ప్రేమ పేరుతో జూనియర్ కాలేజీ లెక్చరర్ నమ్మించి ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్‌కు చెందిన సూర్యదీప్ రాళ్లగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. విద్యార్థినిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు కుటుంబ సభ్యులు ఆర్‌జిఐఎ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి లెక్చరర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News