- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగాపూర్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వేణు(15) అనే బాలుడు మృతి చెందాడు. శివారులో మేకలు కాస్తున్న బాలుడిని వాహనంతో ఢీకొట్టి పారిపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఘనంగా పెళ్లి…. మూడు ముళ్లు వేస్తుండగా వరుడు అరెస్ట్
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి మూసి ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న సుష్మా(35) మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి దాదాపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
- Advertisement -