Monday, December 23, 2024

లవర్ వేధింపులు… యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మూసాపేటకు చెందిన క్రాంతి, కొంకరకలాన్ చెందిన పల్లవి(21) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పల్లవి వండర్‌లాల్‌లో ఉద్యోగం చేస్తుండడంతో ప్రణయ్‌తో చనువుగా ఉంటుందని క్రాంతికి అనుమానం కలిగింది. దీంతో క్రాంతి, పల్లవి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గురువారం పల్లవిని తన బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు. ఇద్దరు మధ్య ఇదే విషయంలో గొడవ జరగడంతో బాగోతం అంతా తనకు తెలుసునని, పరువు తీస్తానని బెదిరించడంతో మనస్థాపానికి పల్లవి గురైంది. ఐ లవ్ యు లాస్ట్ మేసేజ్ అని క్రాంతి వాట్సాప్‌కు చేసింది. వెంటనే ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో క్రాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. శుక్రవారం పల్లవి చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్రాంతి, ప్రణయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News