Monday, December 23, 2024

ఫ్యామిలీతో పాటు యూత్‌కు నచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న పూర్తి ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ “దర్శకుడు పవన్ చెప్పింది చెప్పినట్లుగా తీశాడు.

యుక్తి తరేజ చాలా బ్యూటిఫుల్ గా వుంది. ఈ సినిమాతో అందరు కనెక్ట్ అవుతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని అన్నారు. దర్శకుడు పవన్ మాట్లాడుతూ “ఈ కథలో రంగబలి అనేది మెయిన్ సెంటర్. దానికి తగ్గట్టు ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టాం. జులై 7న వస్తున్న ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాం”అని తెలిపారు. యుక్తి తరేజ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News