Thursday, January 23, 2025

రంగో రంగా…

- Advertisement -
- Advertisement -

Rango ranga song released from ante sundaraniki

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. నజ్రియా ఫహద్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా కథ చెప్పడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయది ప్రత్యేకమైన శైలి. కథ చెప్పడంలోనే ఆయనకి మంచి సంగీతం అభిరుచి కూడా వుంది. ఆయన సినిమాల్లోని పాటలు డిఫరెంట్‌గా ఉంటూ ఒక్కో పాట వివిధ వయసుల వారికి కనెక్ట్ అవుతుంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ‘అంటే సుందరానికీ’ ఫస్ట్ సింగిల్ పంచెకట్టు, సెకెండ్ సింగిల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ’రంగో రంగా’ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కథలో సుందరం పాత్ర పరిస్థితిని హిలేరియస్‌గా చూపించింది. సంగీత దర్శకుడు ఈ పాటని చాలా డిఫరెంట్‌గా కంపోజ్ చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు అందించిన సాహిత్యం క్యాచీగా వినోదాత్మకంగా వుంది. కారుణ్య ఈ పాటను చాలా ఎనర్జిటిక్‌గా ఆలపించారు. జూన్ 10న తెలుగు,తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News