Monday, January 20, 2025

హోంమంత్రి లేని రాష్ట్రంలో మహిళలకు కరువైన రక్షణ:రాణి రుద్రమ

- Advertisement -
- Advertisement -

హోంమంత్రి లేని తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు రోజు రోజుకీ పెరిగి పోతున్నాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ వరంగల్ సభ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మహిళల పేరుతో పెట్టిన సభ కాదని, మహిళలను వంచించి పెట్టిన సభ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితుల్లో మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్లు కాదని, రేవంత్ రెడ్డి ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని కోరారు.

50 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహిళల సంక్షేమం పట్ల సోయి లేకుండా పాలించడం సిగ్గుచేటని, మహిళల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి పనిచేయాలని, బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం పరిపాలన దక్షత అనిపించుకోదన్న సంగతి గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం బంద్ చేసి, మందిని తొక్కుడు బంద్ చేసి, మహిళలను ముంచుతూ, మోసం చేయడం ఆపి పరిపాలన మీద శ్రద్దపెట్టాలని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News