Sunday, December 22, 2024

రాణిరుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డి ఆస్తుల వేలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి నేతలకు బిగ్‌షాక్ తగిలింది. బిజెపి నేతలు రాణిరుద్రమ, జిట్టా బాలకృష్ణా రెడ్డి రుణ ఎగవేతకు పాల్పడినట్లు రిలయన్స్ సంస్థ (రిలయన్స్ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్) పేర్కొంది. రూ. 18 కోట్ల రుణ ఎగవేతలో బిజెపి నేతలు రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణా రెడ్డి ఆస్తులు వేలం వేసినట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డి ఇద్దరు కలిసి దందాలు చేసి రిలయన్స్ వద్ద భారీగా రూ. 18 కోట్లకు పైగా లోన్ తీసుకున్నట్లు తెలిపింది. అప్పు తిరిగి చెల్లించక పోవడంతో రిలయన్స్ సంస్థ అస్తులు వేలానికి నోటీసు ఇచ్చింది.

అయితే, లక్ష్మీ విలాస్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోగా, రిలయన్స్ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ సంస్థ వేలం వేస్తున్నది. వేలం అంశాల వివరాలు, అమ్మకాల నియమ నిబంధనలు కూడా పేర్కొంది. వారి ఆస్తులను తనిఖీ చేసేందుకు ఈనెల 27వ తేదీన వీలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇందులో బిడ్లను మార్చి 1న, ఇ వేలం మార్చి 2న ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిజెపి నేతలపై అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News