Sunday, December 22, 2024

రాంజీ ముఠా సభ్యుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః  దోపిడీలకు పాల్పడుతున్న రాంజీ ముఠా సభ్యుడిని చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 30.1తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం, కడలూరు జిల్లా, తిర్‌క్కతెరు, భారతీనగర్, ఎల్‌ఎన్ పురంకు చెందిన జగన్, కిరణ్, యాతవాన్, అప్పు అలియాస్ మోహన్‌రాజు, వెంకటేషన్ కలిసి దోపిడీలు చేస్తున్నారు. నిందితులు మార్చి 04వ తేదీ, 2023లో నగరానికి వచ్చారు.

కొత్తపేటలోని ఫస్ట్ క్రై వద్ద వైద్యురాలి దృష్టి మరల్చి ఆమె కారులోని బంగారు ఆభరణాలను చోరీ చేశారు. బాధితురాలు కారు వద్దకు వచ్చిన తర్వాత మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పడంతో కారు లాక్ ఓపెన్ చేసి చూసేందుకు ముందుకు వచ్చింది. ఇదే అదునుగా భావించిన మిగతా ముఠా సభ్యులు కారులోని బంగారు ఆభరణాలు, డైమండ్ వస్తువులు చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేసి ముఠాలోని ఏ5గా ఉన్న వెంకటేషన్‌ను అరెస్టు చేశారు. మిగతా ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. నిందితులను ఎస్సైలు ముదాసిర్‌అలీ, సురేందర్ తదితరులు కలి సి పట్టుకున్నారు.
రాంజీ గ్యాంగ్...
దృష్టి మరల్చి దోపిడీలు చేయడంలో నిపుణులైన రాంజీ గ్యాంగ్ లేదా తిరుచ్చి ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఒకే గ్రామానికి చెందిన ముఠా సభ్యులు దోపిడీలు చేసేందుకు తరచూ దేశవ్యాప్తంగా తిరుగుతారు. వారు ఎంచుకున్న ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ వద్ద డబ్బులను కింద పడేస్తారు. కార్ల వద్దకు వచ్చిన వారిని మీ డబ్బులు కిందపడిపోయాయని చెబుతారు. బాధితులు తమ డబ్బులే కావచ్చని కారు దిగి వచ్చి చూస్తుండగానే మిగతా వారు కారులోని డబ్బులు తీసుకుని పారిపోతారు. ఇలాంటి నేరాలు రాంజీ ముఠా సభ్యులు గతంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News