కోల్‌కతా: హర్యానాతో కోల్‌కతా వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ పోరులో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ముంబై ఇప్పటి వరకు 292 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఆయుష్ మాత్రే, ఆకాశ్ ఆనంద్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోయారు. ఆయుష్ 5 ఫోర్లతో 31 పరుగులు చేయగా, ఆకాశ్ 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన సిద్దేశ్ లాడ్ (43) పరుగులు సాధించాడు. మరోవైపు కెప్టెన్ అజింక్య రహానె, స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 10 ఫోర్లతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇక చెలరేగి బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ 86 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి శివమ్ దూబె 30 (బ్యాటింగ్) రహానెకు అండగా ఉన్నాడు. కాగా, హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసింది. ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది.