నాగ్‌పూర్: ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ పోరులో విదర్భ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (106) సెంచరీతో ముంబైని ఆదుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై ఇన్నింగ్స్ తక్కువ పరుగులకే ముగిసింది.
విదర్భ బౌలర్లలో పార్థ్ రెఖాడె నాలుగు, యశ్ ఠాకూర్, హర్ష్ దూబె రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన విదర్భ బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (59), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (31) పరుగులతో క్రీజులో ఉన్నారు. విదర్భకు ఇప్పటి వరకు 260 పరుగుల ఆధిక్యం లభించింది.
గుజరాత్ దీటైన జవాబు
కేరళతో జరుగుతున్న మరో సెమీ ఫైనల్లో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది. కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ అజారుద్దీన్ 341 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 177 పరుగులు చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన గుజరాత్‌కు ఓపెనర్లు ప్రియాంక్ పాంచల్, ఆర్య దేశాయ్ ఆదుకున్నారు. దేశా య్ (73) పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి ప్రియాంక్ 117 పరుగులతో క్రీజులో ఉన్నాడు.