Monday, January 20, 2025

‘యాజ్ ది వీల్ టర్న్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రంజిత్ ప్రతాప్..

- Advertisement -
- Advertisement -

చెన్నై: రాయల కార్పొరేన్స్ వజ్రోత్సవాల సందర్భంగా, వ్యాపార ప్రపంచంలో సాగించిన విశేష ప్రయాణ అనుభవాలని లోతైనదృష్టితో ఆకట్టుకునేలా రాసిన పుస్తకాన్ని రాయల కార్పరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ ప్రతాప్ ఈరోజున ఆవిష్కరించేరు. “యాజ్ ది వీల్ టర్న్స్” పేరిట వెలువరించిన ఈ పుస్తకం రంజిత్ ప్రతాప్ వ్యక్తిగత అనుభవాలు, కష్టాలు, విజయాల గురించి చదువరులకు ప్రేరణ ఇచ్చేలా ఆసక్తికర కథనంగా సాగుతుంది. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాయల కార్పొరేషన్ కు చెందిన అధికారులు, స్నేహితులు, పదవీ విరమణ చేసిన అధికారుల సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేరు.

వ్యాపార రంగంలో రంజిత్ ప్రతాప్, 50 ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భానికి ఈ పుస్తకం ఆవిష్కరణ గణనీయ మైలురాయిగా నిలుస్తుంది. 1973లో గ్రూప్ కంపెనీల్లో చేరిన రంజిత్ ప్రతాప్, చేపట్టిన పరివర్తనాత్మక మార్గం ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దడమేకాక, వ్యాపారపటంలో తిరుగులేని ముద్రవేసింది. ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయం, కార్పొరేట్ ప్రపంచంలో సాగించిన అర్థశతాబ్ధపు ప్రయాణంలో రంజింత్ ప్రతాప్ ని నిర్వచించే వ్యక్తిగత, ఎదుగుదల, వ్యాపార విజయాలు, ఎత్తుపల్లాలని సుస్పష్టంగా కళ్ళకు కడుతుంది.

ఈ సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ” రాయల కార్పొరేషన్ యొక్క 75వ సంవత్సర వేడుకల్లో భాగంగా ఇక్కడకు రావడంతోపాటు రంజిత్ ప్రతాప్ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని ఒక గౌరవం గా భావిస్తున్నాను. వ్యాపారవేత్తల విజయాల గురించి ఈ పుస్తకాన్ని విడుదల చేయడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను, ఎందుకంటే వారి జీవిత కథలు, వారి విజయాలు , వ్యాపారం, సమాజానికి వారందించిన తోడ్పాటు ప్రస్తుత మరియు భావి తరాలు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఎదగడానికి ఎల్లప్పుడూ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు మాట్లాడిన వ్యాఖ్యాతలు మాటలు వినడం, ఈ మహోన్నత కుటుంబం గురించి వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తిగా ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పగలను, అదేమిటంటే జీవితంలో ఎప్పుడూ రాణించడమే లక్ష్యంగా ఉండాలి.

రాణించాలనే లక్ష్యం మీకు ఉంటే, మీరు కష్టపడి పని చేస్తారు. ఆ లక్ష్యాన్ని సాధించటానికి నిర్విరామంగా ప్రయత్నం కొనసాగిస్తారు. రెండవది, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో క్రమశిక్షణ మరియు అంకితభావం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు ఖచ్చితంగా జీవితంలో రాణిస్తారు. రాయల కార్పొరేషన్‌ ఇందుకు ఉదాహరణ. నేటి పోటీ వ్యాపార వాతావరణంలో, అనేక కంపెనీల వ్యవస్థాపకుడు అయిన ఒక కార్పొరేట్ నాయకుడు తెలివిగా, అప్రమత్తంగా ఉండాలి, ఉత్తమమైన వాటితో పోటీ పడగలగాలి, కాల పరీక్షలో నిలబడాలి మరియు స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలి, ప్రపంచంలో ఉత్తమమైన వారితో పోటీ పడేలా తీర్చిదిద్దాలి. రాయల గ్రూప్ సరిగ్గా ఆ పని చేసిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను” అని అన్నారు.

ఈ పుస్తకం శీర్షిక, జీవితం ఇంకా వ్యాపారం తాలూకు చక్రీయ స్వభావానికి ఉపమానంగా నిలిచి, మార్పుని స్వీకరిస్తూ అనుగుణ్యంగా, పట్టుదలతో సాగాల్సిన ప్రాముఖ్యతని నొక్కిచెబుతుంది. రంజిత్ ప్రతాప్ కథ, నిరంతర శ్రమ తాలూకు శక్తి, పట్టుదలతో సాధించిన విజయానికి నిదర్శనంగా నిలుస్తుంది. రంజిత్ ప్రతాప్ “ఏజ్ ది వీల్ టర్న్స్” ద్వారా, వ్యాపార అభిలాషలని అనుసరించి పట్టుదలతో ప్రయత్నించడానికి, వైఫల్యం నుంచి నేర్చుకోడానికి చదువరులకి ప్రేరణ ఇస్తున్నారు. ప్రతి సవాలూ, ఎదగడానికి కొత్త ఆవిష్కరణలకి అవకాశాన్ని ఇస్తుందన్న ఆయన నమ్మకాన్ని ఈ అనుభవాల కథనం ప్రతిఫలిస్తుంది.

రంజిత్ ప్రతాప్, మేనేజింగ్ డైరెక్టర్, రాయల కార్పొరేషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈరోజు ఇక్కడ నిలబడినందుకు గర్విస్తున్నాను. మా కార్పొరేట్ చరిత్రలో ఈరోజు నిజంగా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మా వజ్రోత్సవం, ఈ కార్యకలాపాలకి నేను సారథ్యం వహిస్తూ 50 ఏళ్ళయ్యాయి, అలాగే నా పుస్తకం ఆవిష్కరణ రోజుకూడా. ఆటోమొబైల్ అసెంబ్లింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వరకూ సాగినదే రాయల కథ. రాయల గ్రూప్ ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టినా అందులో విజయం సాధించిందని నేను గర్వంగా చెప్పగలను, వేర్వేరు కాలాల్లో వేర్వేరు సాంకేతికతలకు మేం అనుగుణంగా మారడం, కొత్త సాంకేతికతలని అందిపుచ్చుకుని, అణుగుణ్యంగా మారి, ప్రగతిసాధించడంలో మా సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. “దశాబ్ధాల కాలంలో వ్యాపార పర్యావరణంపై రాయలగ్రూప్ చెరపలేని ముద్రవేసినందుకు, ఈ సుందరమైన నగరం ఎదుగుదలలో మా పాత్రకూడా వున్నందుకు, చెన్నైలో గొప్ప మైలురాళ్ళుగా నిలిచే నిర్మాణాల్లో అది కనిపిస్తున్నందుకు నాకు గర్వంగా వుంది” అన్నారు.

“శ్రమించాలి, ప్రయత్నించాలి, కనిపెట్టాలి, కాని లొంగిపోవద్దు” అన్న జీవితాదర్శానికి రంజిత్ ప్రతాప్ కట్టుబడి వుండడమే, ఆయన సాధించిన విజయాల వెనక చోదక శక్తి. పట్టుదల, కృతనిశ్చయాలతో ఆయన ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని అధిగమించి, తన తాత, తండ్రి ఘన వారసత్వాన్ని నిలబెడుతూ విజయవంతమైన మధ్యతరహా సంస్థని నిర్మించగలిగేరు. 1921లో స్థాపించిన నాటి నుంచి, రాయల గ్రూప్, మాన్యుఫాక్చరింగ్, రియల్ ఎస్టేట్, సైంటిఫిక్ ఫార్మింగ్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులతో దృఢమైన సంఘటిత సంస్థగా ఎదిగింది. వ్యవస్థాపక కుటుంబం వచ్చిన ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం పేరునే పెట్టుకున్న ఈ సంస్థ తన మూలాలకి గర్విస్తోంది.

మనోహరమైన వృత్తాంతాలు, ప్రస్తావనలు, స్వయంగా చెప్పిన విషయాలతో, ఈ పుస్తకం చదువరులని రాయల గ్రూప్ క్రమవికాస అసాధారణ ప్రయాణం ద్వారా తీసుకెళుతుంది, సవాళ్ళని ఎదుర్కుని నిలబడి, కొత్త అవకాశాలని ఆందిపుచ్చుకోవడంలో దాని సామర్థ్యాన్ని కళ్ళకు కడుతుంది. ఇబ్బందుల్లో వున్న కమర్షియల్ పైనాన్స్ కార్పొరేషన్ ని విజయవంతంగా తీర్చిదిద్దడం, ఉద్యోగుల్లో ధైర్యాన్ని పాదుకొల్పడం, కంపెనీ అదృష్టాలని తిరగరాయడం వంటి అంశాలతో, కుటుంబ వ్యాపారంలో రంజిత్ ప్రతాప్ తొలినాళ్ళ అనుభవాలని ఇది వివరిస్తుంది. ఇప్పుడు ఇది మూడోతరమైన, రంజిత్ ప్రతాప్ సారథ్యంలో, ఆయుధాలు మరియు మందుగుండు, రియల్ ఎస్టేట్, రక్షణ రంగానికి మాన్యుఫాక్యరింగ్ సరఫరాలు వంటి సరికొత్త రంగాల్లో ఆసక్తులతో సహా ఈ గ్రూపు, విభిన్నరంగాల్లోకి అగుడుపెట్టింది. అదనంగా, ఈ గ్రూపు, సేంద్రీయ వ్యవసాయంలోకి అడుగుపెట్టి, దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలని తీర్చేందుకుగాను ప్రపంచస్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని నెలకొల్పింది.

రంజిత్ ప్రతాప్ అనుకూల వైఖరి, తన ఆలోచనల్లో అకుంఠిత విశ్వాసం ఈ గ్రూపు విజయానికి గుండెకాయలాంటిది. ఆయన నాయకత్వం రాయల కార్పొరేషన్ కి మించి సాగింది, ఇండో-జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (సదరన్ రీజియన్) ఛైర్మన్ గా, చెన్నైలో జర్మన్ బిజినెస్ గ్రూప్ కి సారథిగా, భారత జర్మనీల మధ్య వ్యాపార సంబంధాలు బలపడ్డానికి కట్టుబడి కృషిచేస్తున్నారు. వ్యాపార ఔత్సాహికులు, వ్యాపారవేత్తలు, విజయవంతమైన సంఘటిత ప్రగతి తాలూకు గతిశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ఆసక్తికలిగినవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం “యాజ్ ది వీల్ టర్న్స్”.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News