Wednesday, January 22, 2025

సివిల్స్‌లో సత్తా చాటిన మహేశ్ భగవత్ స్టూడెంట్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సివిల్స్ ర్యాంకుల్లో సిఐడి చీఫ్ మహేశ్ భగవత్ స్టూడెంట్స్ మరోసారి సత్తా చాటారు. ఈసారి ఏకంగా 150 మం ది సివిల్స్ అభ్యర్థులు ర్యాంకులు పొందడం విశేషం. అయితే తన మార్గనిర్దేశనంలో ఈ ఏడాది సివిల్స్ టాపర్ ఇషితా కిశోర్ ఉండడం గొప్ప విషయ మని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రత్యేకించి సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకు సంబంధించి ప్రతిరోజూ మార్గనిర్దేశనం చేసినట్లు వెల్లడించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా రెండు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశామని, వీటిల్లో దేశవ్యాప్తంగా వందల మంది సివిల్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారన్నారు. ప్రతిరోజూ వారికి జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసి, ఇంటర్వ్యూను ఎదుర్కొనే విధానంపై గైడెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో పాటుగా ఫోన్‌లోనూ, నేరుగా తనని కలిసిన అభ్యర్థులకు సైతం పలు అంశాలపై సూచనలు చేసినట్లు వెల్లడించారు.

ఈసారి సివిల్స్‌కు అర్హత సాధించిన మొత్తం 933 మందిలో 150 మంది వరకు తన స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపారు. వీరిలో 1వ ర్యాంకు సాధించిన ఇషితా కిషోర్, 4వ ర్యాంకు స్మృతి మిశ్రా, 14వ ర్యాంకు కృతికా గోయెల్, 22వ ర్యాంకు జివిఎస్ పవన్ దత్తా, 25వ ర్యాంకు సుంకె కష్మిరా కిశోర్, 35వ ర్యాంకు అజ్మిరా సంకేత్ కుమార్, 38వ ర్యాంకు అనూప్ దాస్, 54వ ర్యాంకు రిచా కులకర్ణి, 78వ ర్యాంకు ఉత్కర్ష్‌కుమార్, 74వ ర్యాంకు ఆయుషీ జైన్, 76వ ర్యాంకు సాధించిన వసంత్ దాబుల్కర్ టాప్-100లో ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News