ముంబై: ఇటీవల ఓ మ్యాగజైన్‌కు నగ్న ఫోజులుచ్చి చర్చనీయాంశుడయ్యాడు ప్రముఖ నటుడు రణవీర్ సింగ్. దానిపై కొందరు ఫిర్యాదు చేశారు. కాగా ముంబైల్నో చెంబూరు పోలీస్ స్టేషనుకు ఉదయం 7 గంటలకు చేరుకోగా, ఉదయం 9 గంటల వరకు అతడిని పోలీసులు విచారించారు. రచ్చ మొదలయినప్పటి నుంచి అతడు పెద్దగా నోరు విప్పలేదు. పోలీసుల వద్ద కూడా తనకు పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై అవగాహన లేదని బదులిచ్చాడు. పోలీసు విచారణలో రణవీర్ సింగ్ చాలా వరకు మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఫోటోలను తాను అప్‌లోడ్ చేయలేదని, ప్రచురించలేదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. నటుడిగా క్రియేటివ్ మేరకు నగ్న ఫోటోలు దిగినట్లు చెప్పాడు. ఇదిలావుండగా నటుడు రణవీర్ సింగ్‌పై ఐపిసి సెక్షన్‌లు 292,294,509,67(ఎ) కింద కేసులు నమోదయ్యాయి. అవసరమనుకుంటే మరోసారి సమన్లు జారీ చేసి పిలుస్తామని విచారణాధికారి తెలిపి అతడిని వదిలిపెట్టినట్లు సమాచారం.
పోలీసు విచారణ ఎదుర్కొన్న రణవీర్ సింగ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -