Friday, March 14, 2025

యూట్యూబ్ లో చూసి బంగారం స్మగ్లింగ్ చేశా:రన్యారావు

- Advertisement -
- Advertisement -

దుబాయి నుంచి కేజీల కొద్దీ బంగారం స్మగ్లింగ్ చేయడం అంత ఈజీ కాదు..నటి రన్యారావు పకడ్బందీగా ప్లాన్ సిద్ధం చేసుకుని, చక్కగా అమలు చేయడం ద్వారా దుబాయి నుంచి బంగారు కడ్డీలను దొంగచాటుగా తీసుకువచ్చారు. యూట్యూబ్ లో చూసి ఓ పద్ధతి ప్రకారం ఎలా బంగారాన్ని ప్యాక్ చేయాలి, దుస్తులలో ఎక్కడెక్కడ దాచి పెట్టాలని కనుక్కుని మరీ స్మగ్లింగ్ చేశారు.
దుబాయి విమానాశ్రయంలో తనకు ఎవరు ఎలా బంగారాన్ని అప్పగించారో, పట్టుబడి ఉండడానికి దానిని ఎలా దాచి పెట్టిందో రన్యారావు వివరించగా అధికారులు ఓ డాక్యుమెంట్ లో ఆ విషయాలని పేర్కొన్నారు. ఆమెకు బెయిల్ ఇవ్వకుండా పలు అభ్యంతరాలను ఆ డాక్యుమెంట్ లో వివరించారు. రన్యారావు సీనియర్ ఐపీఎస్ అధికారి సవతి కుమార్తె. ఆమె తన దుస్తులలో దాదాపు 14 కిలోగ్రాముల బంగారు కడ్డీలను తీసుకువస్తూ మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో పట్టబడ్డారు. ఈ స్మగ్లింగ్ వెనుక పెద్ద సిండికేట్ ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే రన్యా రావు మాత్రం బంగారం స్మగ్లింగ్ కు పాల్పడడం ఇదే మొదటి సారి అని పేర్కొనడం విశేషం.

ఇంటరాగేషన్ సందర్భంగా రన్యారావు తానకు ఇంటర్ నెట్ ద్వారా ఓ ఫోన్ వచ్చిందని, దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 3 వద్ద గేట్ ఏ నుంచి బంగారం అందుకోవలసిందిగా ఆ ఫోన్ కాల్ చేసినవారు కోరారని వివరించారు. తెల్లటి పొడవాటి గౌన్ ధరించిన ఓ వ్యక్తి ని ఎయిర్ పోర్ట్ లో డైనింగ్ లాంజ్ తాను కలిశానని చెప్పారు. అతడి నుంచి మందమైన టార్పాలిన్ ప్లాస్టిక్ కాగితంలో చుట్టి ఉన్నబంగారం కడ్డీలను తాను అందుకున్నట్లు పేర్కొన్నారని ఆ డాక్యుమెంట్ లో తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతడు ఆరు అడుగుల పొడవు, తెల్లగా ఉన్నాడని, కాస్త అమెరికా యాసలో మాట్లాడాడని, అతడు తనను ఒ పక్కకు తీసుకువెళ్లి బంగారాన్ని తనకు అందజేశాడని రన్యారావు వివరించారు. స్మగ్లింగ్ చేయడానికి ముందే ప్లాన్ వేసుకున్న శ్రీమతి రన్యారావు విమానాశ్రయానికి రావడానికి ముందే అక్కడికి దూరంలోని ఓ స్టేషనరీ దుకాణంలో
అంటుకునే టేప్ ను కొనుక్కుంది. ఎయిర్ పోర్ట్ లో తనకు కత్తెర దొరకదని తెలిసి, ఆమె ముందే టేప్ ను ముక్కలుగా కత్తిరించి తన బ్యాగ్ లో ఉంచుకుంది.

డైనింగ్ లాంజ్ లో బంగారం అందుకున్న తర్వాత నేరుగా వాష్ రూమ్ కు వెళ్లింది. ప్యాకెట్లను విప్పిచూస్తే.. 12 బంగారు కడ్డీలు, కొన్ని కట్ చేసిన ముక్కలు కనిపించాయి. అక్కడ యూట్యూబ్ తెరచి చూసి , శరీరంలో బంగారాన్ని ఏ ఏ ప్రదేశాల్లో దాచుకోవాలో చూసిన తర్వాత ఆమె టేప్ ను ఉపయోగించి, తొడ కండరాలు, నడుము చుట్టూ బంగారు కడ్డీలను చుట్టుకుంది. చిన్న చిన్న ముక్కలను బూట్లలోనూ, కొన్ని ముక్కలను తన జేబుల్లోనూ వేసుకున్నట్లు తెలిపారని డాక్యుమెంట్ లో వివరించారు. మార్చి 3న ఎమిరేట్స్ విమానంలో బెంగళూరు విమానంలో బెంగళూరు చేరుకుంది. కుంభకోణంతో సంబంధం ఉన్న ఓ ప్రొటోకాల్ అధికారి సాయంతో విమానాశ్రయం సెక్యూరిటీ వ్యవస్థను దాటుకుని ముందుకు సాగినట్లు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.

ఇక విమానాశ్రయంలో ప్రొటోకాల్ అధికారి బసప్ప బెల్లూర్ మాట్లాడుతూ, రన్యారావు సవతి తండ్రి, రామచంద్రరావు తన కుటుంబసభ్యులకు ప్రొటోకాల్ ప్రకారం సహాయం అందించాలని ఎప్పటి కప్పుడూ తనకు సూచించే వారు అంటూ, ఆయన పంపిన పత్రాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులకు చూపాడు. బసప్ప బెల్లూర్ సాయంతో రన్యారావు మరో నాలుగు అడుగుల్లో విమానాశ్రయం బయటకు చేరుతుందని అనుకున్న సమయంలో డిఆర్ ఐ అధికారులకు అనుమానించి పట్టుకున్నారు. ఆమెను తనిఖీ చేసి, బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు గత ఆరు నెలల్లో దాదాపు 27 సార్లు దుబాయ్ కి వెళ్లారు. గతనెల 15 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు దుబాయ్ కి టూర్ కు వెళ్లి వచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News