Wednesday, January 22, 2025

బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్‌పై అత్యాచారం కేసు

- Advertisement -
- Advertisement -

Rape case against Bollywood singer Rahul Jain

ముంబై: ముంబైలోని తన ఫ్లాట్‌లో 30 ఏళ్ల మహిళ కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌పై అత్యాచారం చేసిన ఆరోపణలపై బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్‌లో రికార్డ్ చేసిన తన స్టేట్‌మెంట్‌లో ఫిర్యాదుదారు రాహుల్ జైన్ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించారని, ఆమె పనిని మెచ్చుకున్నారని చెప్పింది. సబర్బన్ అంధేరిలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న తన ఫ్లాట్‌ను సందర్శించాల్సిందిగా ఆమెను కోరాడని, ఆమెను తన వ్యక్తిగత కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌గా నియమిస్తానని హామీ ఇచ్చాడని ఎఫ్‌ఐఆర్‌ను ఉటంకిస్తూ పోలీసు అధికారి తెలిపారు. ఆ మహిళ ఆగస్టు 11న రాహుల్ జైన్‌ ఫ్లాట్‌ను వెళ్లింది. అతను తన వస్తువులను చూపించే నెపంతో తన బెడ్‌రూమ్‌కి తనతో పాటు రమ్మని అడిగాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడని అధికారి తెలిపారు. అయితే గతంలోనూ సింగర్ రాహుల్ పై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. గాయకుడు రాహుల్ జైన్‌ మాత్రం ఈ ఆరోపణలు ఫేక్ అని చెప్పాడు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News