Thursday, December 19, 2024

జానీ మాస్టర్‌పై రేప్ కేసు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నార్సింగి/సిటీ బ్యూరో: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. అతడి వద్ద ప నిచేస్తున్న డ్యాన్సర్ తనపై జానీ మాస్టర్ పలుమా ర్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల క థనం ప్రకారం…మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి కాలనీలో జానీ మాస్టర్ అలియా స్ షేక్ జానీ బాషా ఉంటున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్‌లో జానీ మాస్టర్ పలు సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. జానీ మా స్టర్‌కు మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి(21)తో ముంబాయిలో 2017లో పరిచయం ఏర్పడింది. తర్వాత 2019 నుంచి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా యువతి పనిచేస్తోంది. బాధిత యువతి నా ర్సింగిలో ఉంటూ జానీమాస్టర్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసింది. ఈ క్రమంలోనే ఇ ద్దరు కలిసి పలు నగరాలకు వెళ్లేవారు. చెన్నై, ముంబాయి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లగా అక్కడ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని, ఎవరికైనా చెబితే చంపివేస్తానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొంది.

అల్కాపురిలోని జానీ మాస్టర్ ఇంట్లో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఔట్‌డోర్ షుటింగ్ సమయంలో తను ఉంటున్న రూమ్‌కు వచ్చి అత్యాచారం చేసేవాడని తెలిపింది. తాను ఉంటున్న ఇంటి ముందు ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి పార్సిల్ పెట్టాడని, ఇదే చివరి అవకాశమని, ఇక నుంచి సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తామని అందులో రాసి ఉందని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు వెంటనే రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తర్వాత సంఘటన జరిగిన నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాపర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా,శారీరకంగా వేదింపులకు గురిచేస్తూ పలుమార్లు అత్యాచారం చేసాడని భాదిత యువతి ఫిర్యాదులో పేర్కొందని నార్సింగి ఇన్స్‌స్పెక్టర్ హరిక్రిష్ణ రెడ్డి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అతడిపై సెక్షన్ 376,506 క్రిమినల్ బెదిరింపు, 323 లోని క్లాజ్ (2), (ఎన్) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసామని తెలిపారు. విచారణ కోసం జానీ మాస్టర్‌ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదని తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని నార్సింగి ఇన్స్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. కాగా జనసేన పార్టీ స్టార్ క్యాంపేయినర్‌గా ఉన్న జానీ మాస్టర్‌ను అత్యాచారం ఆరోపణలు రావడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

కొరియోగ్రాఫర్స్ సంఘం సస్పెండ్?
అత్యాచారం కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొరియోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్నాడు. యూనియన్‌లో ఎవరినైనా సస్పెండ్ చేయాలంటే సమావేశం ఏర్పాటుచేసి అందరి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూనియన్‌లో ఏవైనా పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినప్పుడే కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు, దీనినే యూనియన్ బైలాస్ అంటారు. అసోసియేషన్ నిబంధనల ప్రకారం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరుతున్నారు.

ఒకవేళ జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరిస్తాయా.. లేదంటే ఆయన సభ్యత్వాన్ని రద్దుచేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సభ్యత్వం రద్దు చేస్తే ఆయన తన అధ్యక్ష పదవిని కోల్పోతారు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో సభ్యులైన జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు అందిందని ఫిలిం చాంబర్ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. దీనిపై తెలుగు ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసిట్లు తెలిపారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయిన తర్వాత పిఓఎస్‌హెచ్ చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News