Sunday, January 19, 2025

యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు

- Advertisement -
- Advertisement -

ఇటీవల సోషల్ మీడియా సెలబ్రిటీలపై లైంగిక ఆరోపణలు, అత్యాచార అభియోగాలు ఎక్కువవుతున్నాయి. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు మరువక ముందే మరో యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని యూట్యూబ్ ఛానల్స్‌లో ఫోక్ సాంగ్ చేసే ఓ యువతి తనపై అత్యాచారం చేశాడని.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని పోలీసులకు వెల్లడించింది. తనతో పాటు కుటుంబ సభ్యులను దూషిస్తున్నాడని చెప్పగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లిక్ తేజ్ రైటర్ కమ్ సింగర్. అంతే కాకుండా జగిత్యాల జిల్లా సాంస్కృతిక సారధిలో ఉద్యోగిగా ఉన్నారు. కాగా, బాధితురాలు, మల్లిక్ తేజ్ చాలా ఫోక్ సాంగ్స్ చేసి గుర్తింపు పొందడమే కాకుండా గతంలో పలు టీవీషోల్లో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవలే యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఓ ప్రైవేట్ పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని.. పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి పేర్కొంది. విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ వీడియోలను తన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ పాపులర్ అయ్యాడు. మరోవైపు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పైనా ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనను వేధించారని ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కేసులు నమోదు కాగా పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News