Saturday, December 21, 2024

పగ పగ… బాలికపై బాలుడు అత్యాచారం… గొంతు కోసి

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలిక తండ్రి కొట్టాడని ఆమెపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని థాణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కల్యాణ్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రక్తపు మడుగులో బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. కొన్ని రోజుల క్రితం బాలిక తండ్రి ఓ బాలుడితో గొడవ జరిగింది. బాలుడిని బాలిక తండ్రి కొట్టాడు. దీంతో బాలిక కుటుంబంపై బాలుడు పగ పెంచుకున్నాడు. బాలిక తీవ్రంగా హింసించిన అనంతరం ఆమెపై బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక గొంతు కోసి హత్య చేశాడు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించామని డిసిపి సచిన్ గుంజాల్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News