Friday, January 10, 2025

సోదరుడు, తండ్రితో నరకం

- Advertisement -
- Advertisement -

Rape of a child for five years in Pune

ఓ చిన్నారిపై ఐదేళ్లుగా అత్యాచారాలు

పుణే : ఓ 11 ఏండ్ల బాలిక గత ఐదేళ్లుగా జుగుప్సాకర లైంగిక అత్యాచారాలకు, వేధింపులకు గురి అవుతూ జీవచ్ఛవంగా మారింది. చిన్న వయస్సులో ఉన్న సోదరుడు , కన్నతండ్రి ఆమెపై వేర్వేరు దశలలో అత్యాచారానికి దిగారు. ఇక తాత , వరసకు మామ అయ్యే మరో వ్యక్తి ఆమెను తరచూ లైంగికంగా వేధిస్తూ వచ్చారని పుణే పోలీసులు శనివారం తెలిపారు. బాలిక ఆరవ సంవత్సరం నుంచే ఈ నరకం అనుభవిస్తూ వస్తోంది. ఈ బాధిత బాలిక కుటుంబంతో బీహార్ నుంచి పుణేకు కొద్ది సంవత్సరాల క్రితం తరలివచ్చింది. ఈ మధ్యలో స్కూలులో చేరిన ఈ బాలిక టీచరు ఏది మంచి స్పర్శ ఏదీ చెడు స్పర్శ అనే అంశంపై పాఠం చెపుతుండగా ఈ బాలిక తన బాధను తెలియచేసుకుని బోరు మంది.

తాను ఈ విధమైన భయంకర స్పర్శలను ఐదేళ్లుగా అనుభవిస్తున్నానని తెలియచేసుకుంది. తన పరిస్థితి ఏమిటనేది తనకే తెలియడం లేదని వాపోయింది. ఈ దశలో దాఖలైన ఫిర్యాదు మేరకు నేర శిక్షాస్మృతి పరిధిలోని పలు నిబంధనల మేరకు కేసులు పెట్టారు. ఈ బాలికకు జరిగిన దారుణంపై దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికైతే ఎవరిని అరెస్టు చేయలేదని, అన్ని విషయాల నిర్థారణ తరువాత తదుపరి చర్యలు ఉంటాయని ఎవరిని వదిలేది లేదని క్రైం విభాగం పోలీసు అధికారి అశ్విని సత్పుతే తెలిపారు. బాలిక తండ్రి కుటుంబం బీహార్‌లో ఉన్నప్పుడు బాలికపై 2017లో అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత పుణేకు వచ్చిన తరువాత కూడా ఇది కొనసాగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News