- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : బాలికపై అత్యాచారం చేసిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఫిలింనగర్‌లో తల్లిదండ్రులతో ఉంటున్న బాలిక(17) ఉంటోంది. వారి ఇంటి పక్కన ఉంటున్న మహేష్(28) బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -