Saturday, December 21, 2024

మైనర్ బాలికపై అత్యాచారం..నిందితుడి ఇంటిపై బాలిక తల్లిదండ్రులు, బంధువుల దాడి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేట గ్రామానికి చెందిన ఐదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (9)పై 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. బాలిక పక్క ఇంట్లో ఉన్న యువకుడు బాలిక ఇంట్లో ఒంటరిగా పనిచేస్తుండగా ఇంట్లోకి చొరబడి బలవంతంగా అమ్మాయిపై యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలికపై జరిగిన ఘటనపై కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అత్యాచారం చేసిన యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసిన గ్రామస్తులు ఆ యువకుడికి చెందిన వాహనాలపై దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు.

గ్రామస్థులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ ఆధ్వర్యంలో చేర్యాల శ్రీనివాస్ కొమురవెల్లి ఎస్త్స్ర ఎల్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో గురునపేట గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మైనర్ బాలిక అత్యాచారం చేసిన యువకునిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని జేఏసీ చైర్మన్ భైరభట్ల చక్రధర్ కోరారు. లేనిపక్షంలో జేఏసీ తరఫున ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News