Friday, November 22, 2024

మైనర్ బాలికపై అత్యాచారం : యువకునికి 20 ఏళ్ల కఠిన శిక్ష

- Advertisement -
- Advertisement -

Rape of minor girl: 20 years rigorous imprisonment for young man

 

ఉజ్జయిన్ : మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ జిల్లాలో 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్‌కు బాధితురాలు సహకరించక పోయినప్పటికీ డిఎన్‌ఎ పరీక్షల ఆధారంగా నిందితుడు 21 ఏళ్ల రాహుల్ ఫులేరియాకు కోర్టు సోమవారం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రూ. 3000 జరిమానా కూడా నిందితునికి విధించారు. షాజపూర్‌కు చెందిన బాధితురాలైన బాలిక తల్లి తన కుమార్టె తన మనుమడిని స్కూలుకు తీసుకెళ్లిన తరువాత కనిపించకుండా పోయిందని గత ఏడాది జనవరి 6 న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో బాధితురాలు నిందితునిపై ఫిర్యాదును వెనక్కు తీసుకొంది. అలాగే విచారణకు సహకరించలేదు. అయినా డిఎన్‌ఎ పరీక్షల ఆధారంగా నిందితునికి శిక్ష పడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News