Tuesday, December 24, 2024

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇంగ్లాండ్‌లో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థికి అత్యాచారం కేసులో ఏడేళ్లు జైలుశిక్ష పడింది. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను తన రూమ్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు నేరం రుజువైంది. ఏడాది క్రితం ఈ సంఘటన జరిగినా తాజాగా వెలుగు లోకి వచ్చింది. ప్రీతి వికల్ అనే 20 ఏళ్ల యువకుడు సౌత్ వేల్స్ లోని కార్డిఫ్ ప్రాంతంలో ఉంటున్నాడు. గత ఏడాది జూన్ నెలలోఅతడు నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఓ మహిళ వేరే బృందంతో కలిసి క్లబ్‌కు వెళ్లింది. ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. క్లబ్‌లో ఆ మహిళ మద్యం ఎక్కువగా తీసుకుంది.

ఆ మత్తులోవికల్, ఆ మహిళ ఇద్దరూ వాళ్ల గ్రూప్‌లను వదిలేసి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత వికల్ ఆమెను తన రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీస్‌లు చెప్పారు. మహిళను వికల్ క్లబ్ నుంచి తీసుకెళ్లడం, ఆమెను భుజాలపై ఎత్తుకెళ్లడం ఇవన్నీ సీసీటీవీ కెమెరా దశ్యాల్లో బయటపడ్డాయి. మహిళపై కార్డిఫ్‌లో ఇలాంటి దాడులు జరగడం చాలా అరుదు. ఓ పథకం ప్రకారం వికల్ ఇదంతా చేశాడని పోలీస్‌లు ఆరోపించారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీస్‌లు విచారణ జరిపి కోర్టులో హాజరు పర్చగా కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News