Sunday, December 22, 2024

యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Rape of young woman in banjarahills

అస్సాంకు చెందిన యువతి,యువకుడు
అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్: ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై తెలిసిన యువకుడు అత్యాచారం చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం… పిఎస్ పరిధిలోని రోడ్డు నంబర్ 5, దేవరకొండ బస్తీలో అస్సాం రాష్ట్ర కు చెందిన యువతి తన సోదరి, బావ వద్ద ఉంటోంది. పివిఆర్ మాల్‌లో బుకింగ్ కౌంటర్‌లో పనిచేస్తోంది. అస్సాం రాష్ట్రానికే చెందిన చిన్మయి సైకియా(22) మ్యాక్స్ షాపింగ్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. నిందితుడిని బాధితురాలి బావ అస్సాం రాష్ట్రం నుంచి పనికోసం హైదరాబాద్‌కు తీసుకుని వచ్చాడు. తెలిసిన వాడు కావడంతో తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి ఆన్‌లైన్‌లో పిజ్జా తెప్పించుకుని తిన్నారు.

తర్వాత నిందితుడు గంటి డోర్ మూసి వేసి యువతిని బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపి వేస్తానని బెదిరించాడు. ఉద్యోగం నుంచి తిరిగి వచ్చి బాధితురాలి అక్క, ఎడుస్తున్న చెల్లిని ప్రశ్నించగా ఏ విషయం చెప్పలేదు. ఈ నెల 5వ తేదీన బాధితురాలు తన సోదరి స్నేహితురాలికి తానకు చనిపోవాలని ఉందని మెసేజ్ పెట్టింది. దానిని ఆమె బాధిత యువతి సోదరికి పంపించడంతో వెంటనే ఇంటికి వచ్చి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. యువతి, ఆమె బావ, అక్క కలిసి ఈ నెల 6వ తేదీన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News