Thursday, January 23, 2025

ఆమెపై అఘాయిత్యాలు

- Advertisement -
- Advertisement -

వేర్వేరు సంఘటనల్లో యువతులు, మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…తెలంగాణలోని నిర్మల్ నుంచి ఎపిలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సులో ఓ మహళ ప్రయాణిస్తోంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బాధితురాలు బస్సులో వస్తుండగా డ్రైవర్ కృష్ణ మహిళకు మంగళవారం తెల్లవారుజామున మాయమాటలు చెప్పి బస్సు వెనుక సీటు వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కృష్ణ మహిళ నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. తర్వాత బాధితురాలు అరవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు చెప్పింది.

వారు వెంటనే ఈ దారుణాన్ని బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బస్సు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి రాగానే ఆపి ఒక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు డ్రైవర్ కృష్ణ పరారయ్యాడు. బస్సులో నుంచి బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. కాగా, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై ఆమె స్నేహితులే అత్యాచారానికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతం రెడ్డి, అంబర్‌పేట, చిన్నరెడ్డి పాలెంకు చెందిన యువతి చిన్ననాటి స్నేహితులు. ఇటీవలే యువతికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది, జాబ్ వచ్చిందని ట్రీట్ ఇవ్వమని గౌతం రెడ్డి అడగడంతో యువతి అంగీకరించింది.

పార్టీ చేసుకునేందుకు ఇద్దరు కలిసి సోమవారం సాయంత్రం ఓంకార్ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న బార్‌లో ఇద్దరు మద్యం సేవించారు, అక్కడే ఉన్న హోటల్ రూమ్‌కు ఇద్దరు కలిసి వెళ్లారు. యువతి మద్యం మత్తులో ఉండడంతో గౌతం రెడ్డి, మరో స్నేహితుడికి ఫోన్ చేసి హోటల్‌కు రమ్మన్నాడు. ఇద్దరు కలిసి మద్యం మత్తులో ఉన్న యువతిపై అత్యాచారం చేశారు. స్పృహలోకి వచ్చిన యువతి రూములో గౌతం రెడ్డితోపాటు మరో యువకుడు ఉండడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. ఇద్దరు యువతిపై అత్యాచారం చేయడంతో రక్త స్రావమైంది, యువతి కేకలు విన్న హోటల్ సిబ్బంది వీరు ఉన్న రూమ్‌కు వెళ్లారు. వారిని చూసిన ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన హోటల్ సిబ్బందిని యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. యువతి హోటల్‌లో ఇచ్చిన ఐడి ఫ్రూప్ ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా ప్రధాన నిందితుడు గౌతం రెడ్డి తర్వాత వనస్థలిపురం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఫేస్‌బుక్ ప్రేమ….
ఫేస్‌బుస్‌లో పరిచయమైన యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు శారీరకంగా కలిసి మోసం చేసిన యువకుడిని రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. జనగాం జిల్లా, గంగారం గ్రామానికి చెందిన బందారం స్వామి(29) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం, రాయపూర్ జిల్లాకు చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపిన స్వామి వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో యువతి హైదరాబాద్‌కు వచ్చింది,

ఈ సమయంలోనే ఇద్దరు శారీరకంగా పలుమార్లు కలిశారు. తర్వాత తాను ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు చెప్పాడు. తనను వివాహం చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయగా నిందితుడు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న యువతి తనపై అత్యాచారం చేశాడని స్వామిపై రాయపూర్ విధానసభ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్‌కు బదిలీ చేశారు. నిందితుడు శ్రీలంక దేశం మీదుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు రాగా పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News