Sunday, December 22, 2024

తాళి కట్టి… క్లాస్‌మెట్‌పై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అనంతపురం: క్లాస్‌మెట్‌ను బెదిరించి తాళ్లి కట్టి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హేమంత్ అనే విద్యార్థి స్కూల్‌లో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థినిని పరిచయం చేసుకున్నాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. ప్రేమంచకపోతే తల్లిని, చెల్లిని చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెకు తాళి కట్టాడు. ఒక రోజు ఇంట్లోకి చొరబడి తన భార్యవు అని ఆమెపై హేమంత్ అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమె తాళి దాచిపెట్టుకుంది. కర్నూల్ లో ఆమె ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. దసరా సెలవులప్పుడు కూడా ఆమెపై మానవ మృగం అఘాయిత్యం చేయడంతో తన తల్లికి ఈ విషయం చెప్పింది. వెంటనే తల్లి బాధితురాలితో కలిసి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News