కౌశంబి(యుపి): ఉత్తర్ ప్రదేశ్‌లోని కౌశంబిలో ఒక 35 సంవత్సరాల దళిత మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. గత గురువారం ఫతేపూర్‌లోని తన బంధువు ఇంటికి ఆమె వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉదిన్ ఖుర్ద్ గ్రామం వద్ద ఆమె వాహనం కోసం ఎదురుచూస్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా అందులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, వారి నుంచి తప్పించుకుని ఆమె తన బంధువు ఇంటికి చేరుకుందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసివస్తుందని ఆ ముగ్గురు వ్యక్తులు ఆమెను బెదిరించినట్లు వారు చెప్పారు. సోమవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌పి రాధేశ్యాం విశ్వకర్మ చెప్పారు. నిందితులను హృతిక్ సింగ్ పటేల్, దీపు సింగ్ పటేల్, ఆకాశ్ తివారీగా గుర్తించినట్లు ఆయన చెప్పారు.
యుపిలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -